Buy Houses in Nandyal

Nandyal Properties
Spread the love

నంద్యాలలో ఇలాంటి వసతులు ఉన్న ఇళ్ళు ఉంటె వెంటనే కొనేస్తున్నారు.

నంద్యాల అవుట్ స్కట్స్ అనగా రైతు నగర్, అయ్యలూరు వై జంక్షన్ ఏరియా,  మహానంది రోడ్, ఆత్మకూరు రోడ్, లాంటి ప్రాంతాలలో ఇండిపెండెంట్ హౌస్ లేదా డుప్లెక్స్ హౌస్ కొనలనుకునేవారు ఇంటికి ఇలాంటి వసతులు ఉంటె వెంటనే కొనేస్తున్నారు.

ముఖ్యంగా ఇండిపెండెంట్ హౌస్ విషయానికి వస్తే ఎక్కువ స్థలంలో చిన్న ఇళ్ళు ఉండేలా, కార్ పార్కింగ్, ఇంటి ఆవరణలోనే గార్డెనింగ్ ఉంటూ, అలాగే ఆ ఇళ్ళు ఉండే వెంచర్ లో చిల్డ్రన్స్ పార్క్, సూపర్ బజార్, మినరల్ వాటర్ ప్లాంటు లాంటి వాటికీ ప్రాముఖ్యత ఇస్తున్నారు.

అలాగే శబ్ద, వాయు కాలుష్యం లేని చోటు తో పాటు మెయిన్ రోడ్ కనెక్టివిటీ, బస్సు, ఆటో కనెక్టివిటీ దగ్గరలో హాస్పిటల్ అందుబాటులో ఉంటె కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

అంటే ఒక రకంగా సిటిల్లో ఉండే గేటెడ్ కమ్యూనిటీ వసతులు కోరుకుంటున్నారు.

Gated Community Houses in Nandyal

ముఖ్యంగా ౩౦ నుండి 60 ఏళ్ల మధ్యలో ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు, పల్లెల నుండి పిల్లల చదువుల కోసం వచ్చే వాళ్ళు ఎక్కువగా కొంటున్నారు.  

అలాగే వ్యాపారస్తులు అయితే నంద్యాల టౌన్ లోనే అనగా Ngo’s కాలనీ, Sbi కాలనీ ఏరియా, సాయి బాబా నగర్ లాంటి ప్రాంతాలలో ౩ నుండి 4 సెంట్లలో ఉండే ఇండిపెండెంట్ హౌసెస్ ని కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. కాకపోతే వీరికి ఇక్కడ కార్ పార్కింగ్, రోడ్ వెడల్పు, అమెన్టీస్ అనేవి సెకండరీ ఆప్షన్ గా ఉంటోంది. వీరు ఇవన్నీ కావాలనుకునేవారు అపార్ట్మెంట్స్ లో కొంటున్నారు.

Buy Sell Properties in Nandyal visit: here

Join The Discussion